Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో 24 గంటల పాటు వర్షాలు పడొచ్చు!

గత రెండ్రోజులుగా రాష్ట్రాన్ని పలకరిస్తున్న అకాల వర్షాలు.. మరో 24 గంటల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, చత్తీస్ గఢ్, విదర్భ, తెలంగాణ ప్రాంతాలపై ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములతో కూడిన జల్లులు.. కొన్ని చోట్ల వడగళ్ళ వానలు పడుతున్నాయి. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోనూ పలు చోట్ల భారీ వర్షం కురిసింది.

More Telugu News